కొత్త ప్రాంతానికి వెళ్లినవారికి ఆ ప్రాంతంలో చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయో ? ఏ హోటల్ బాగుంటుందో ?
ఫుడ్ ఎలా ఉంటుందో ? అనే అనుమానాలు వస్తూవుంటాయి. ఇలాంటి విషయాలని కొత్త వారిని అడగడంకన్నా అక్కడి స్థానికులైతే వివరాలు పూర్తిస్థాయిలో తెలుస్తాయి . కానీ మీకు అక్కడ ఎవ్వరూ తెలియదు . మరి ఎలా ?
ఇలాంటి వారి కోసమే ఫేస్బుక్ 'రికమండేషన్స్ ' అనే ఆప్షన్ ని పరిచయం చేస్తోంది . ఆ ఆప్షన్ పై క్లిక్ చేస్తే చాలు మనం వెళ్లే ప్రాంతం గురించి తెలుసుకోవచ్చు . ఎలాగంటే ఈ ఆప్షన్ పై క్లిక్ చేయగానే ఆ ప్రాంతానికి చెందిన ఫేసుబుక్ ఫ్రెండ్స్ స్పందించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు . అంతేకాకుండా ఫేస్ బుక్ పేజీ నుండే డైరెక్టుగా వారితో మనం మాట్లాడే ఫెసిలిటీ కూడా ఉంది . అలాగే 'గెట్ కోట్ ' అనే ఆప్షన్ ద్వారా అక్కడి ధరలు తెలుసుకొని నేరుగా వాటికీ సంబందించిన వ్యక్తులతో బేరమాడొచ్చు . ప్రయోగంలో ఉన్న ఈ ఆప్షన్ త్వరలో పూర్తిస్థాయి అందుబాటులో ఉంది .
0 comments:
Post a Comment