Friday, 23 December 2016

స్నాప్ డీల్ : ఇంటి ముందుకే నగదు




'స్నాప్ డీల్ ' ఈ -కామర్స్ సంస్థ కొత్తగా వినియోగదారుల  కోసం 'క్యాష్ @హోమ్'సర్వీస్ ని ప్రారంభించింది . ఇందులో రూ . 2,000 నగదుకు  యూజర్స్ ఆర్డర్ ఇవ్వొచ్చు . వినియోగదారుల నగదు ఇబ్బందుల దృష్ట్యా  నిత్యావసరాల  వస్తువుల  కొనుగోళ్ల  విషయంలోఇబ్బందులను కొంతమేర తొలగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని స్నాప్ డీల్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ బన్సాల్ తెలిపారు . 

క్యాష్ ఆన్  డెలివరీ విధానంలో వచ్చిన నగదును 'క్యాష్ @హోమ్ 'సేవలకు వినియోగిస్తామని తెలిపారు . ఈ సేవలకు కన్వీనియస్  ఫీజు కింద ఒక రూపాయిని  ఛార్జ్ చేస్తామని ,దీన్ని ఆర్డర్ బుకింగ్ సమయంలో ఫ్రీఛార్జి లేదా డెబిట్  కార్డు ద్యారా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు . క్యాష్ డెలివరీ సమయంలో వినియోగదారులు వారి ఏటీఎం కార్డును సంస్థ నుండి వచ్చే కొరియర్ పార్టనర్స్ తీసుకువచ్చే పిఓఎస్ మెషిన్ లో స్వైప్ చేస్తే సరిపోతుందని తెలిపారు.   ఒక వ్యక్తి ఒక బుకింగ్ పై  2,000 రూపాయలు మాత్రమే పొందవచ్చు . ప్రస్తుతం ఈ సేవలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి , అవి బెంగళూరు ,గుర్గావ్. తొందరలోనే ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు .  




0 comments:

Post a Comment